Saturday, January 15, 2011

Sree Satyanarayanam

Sree Satyanarayanam

Friday, January 14, 2011

కొలని దోఁపరికి గొబ్బిళ్ళో





రాగం::యదుకుల కాంభోజి

28::- వ--హరికాంభోజి జన్య
ఆ::- స రి2 మ1 ప ద2 సా
అవ::- స ని2 ద2 ప మ1 గ3 రి2 స


తాళం:::ఆది
రచన::అన్నమాచార్య
భాష::తెలుగు



ఈ గొబ్బిళ్ళ పాట యదుకులతిలకుని నాయకునిగా చేసి కన్నెపిల్లలు పాడినది.
గోపికలు తమ ఊహలలో ఉయ్యాలలూగిన వీర శృంగారమూర్తిని పారవశ్యలతో గానం చేసినారు.
అన్నమయ్య ఆ గోపికలలో గోపికయై ఆడినాడు. పాడినాడు.

::: పల్లవి :::

కొలని దోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో...

:::చరణం :::

కొండ గొడుగుగా గోవులఁ గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల-
గుండు గండనికి గొబ్బిళ్ళో.

::::: కొలని దోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో... :::::


:::చరణం ::

పాపవిధుల శిశుపాలుని తిట్ల-
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన-
గోపబాలునికి గొబ్బిళ్ళో...

::::: కొలని దోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో... :::::


:::చరణం ::

దండి వైరులను తఱమిన దనుజుల-
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో...

:::::కొలని దోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో... :::::


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

kolani dhOpariki
raagam: yadukula kaambhOji
28 harikaambhOji janya
Aa: S R2 M1 P D2 S
Av: S N2 D2 P M1 G3 R2 S

taaLam: aadi
Composer::Annamaachaarya
Language::Telugu


::: pallavi :::

kolani dO@Mpariki gobbiLLO yadu-
kulamu svaamikini gobbiLLO...

:::charaNaM ::

koMDa goDugugaa gOvula@M gaachina
koMDuka SiSuvuku gobbiLLO
duMDagaMpu daityulakellanu tala-
guMDu gaMDaniki gobbiLLO.

::::: kolani dO@Mpariki gobbiLLO yadu-
kulamu svaamikini gobbiLLO... :::::


:::charaNaM ::

paapavidhula SiSupaaluni tiTla-
kOpagaanikini gobbiLLO
yaepuna@M gaMsuni yiDumala@M beTTina-
gOpabaaluniki gobbiLLO...

::::: kolani dO@Mpariki gobbiLLO yadu-
kulamu svaamikini gobbiLLO... :::::

:::charaNaM ::

daMDi vairulanu ta~ramina danujula-
guMDe digulunaku gobbiLLO
veMDi@M bai@MDiyagu vaeMkaTagiripai
koMDalayyakunu gobbiLLO...

:::::kolani dO@Mpariki gobbiLLO yadu-
kulamu svaamikini gobbiLLO... :::::